ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్..
- August 13, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 14న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 3 ప్రముఖ కంపెనీల్లో 300 ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
జాబ్స్ .. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Medha Servo Drives Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఏడాదికి రూ.2.85 లక్షల వేతనం ఉంటుంది. ఇతర విభాగాల్లో ఎంపికైన వారికి నెలకు రూ.13,500-రూ.14,500 వేతనం ఉంటుంది.
IIFL Samasta Finance Ltd: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. CRO, Branch Credit Manager, Branch Manager విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. నెలకు రూ.12,500 వేతనం ఉంటుంది.
Flipkart: డెలివరీ బాయ్స్ విభాగాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15000-రూ.20000 వరకు వేతనం ఉంటుంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









