శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి ఆర్యవైశ్య సమ్మేళనం
- August 13, 2023
ఐర్లాండ్: ఐర్లాండ్ నందలి డబ్లిన్ నగరంలో 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్ నందు భగినీహస్త బోజనకార్యక్రమాన్ని నిర్వహించారు. అందరు అనుకొన్నప్రకారం వారి వారి ఇంటినుండి వండి తెచ్చిన మధురమైన వంటకాలతో కలుసుకున్నారు, కార్యక్రమంలో మొదటగా బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి మరియు చిన్నారి లక్ష్మి హాసిని గారి భక్తి గీతాలు అందర్నీ భక్తిపారవశ్యంలో తన్మయత్వం చెందారు. తరువాత సంతోష్ గారి ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్, గారి సహకారంతో అందరు ఆనందంగా విందుభోజనాన్ని ఆరగించారు, తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అయిన అంకిత పవన్ గారు మొత్తం కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ అందర్నీ ఆనందడోలికల్లో పరవశింపచేసారు, ప్రత్యేకంగా చిన్నపిల్లలతో పద్యాలతో, శ్లోకాలతో, తెలుగు భాషలో ప్రావిణ్యం, సాంప్రదాయ దుస్తులు మొదలగు విషయాల్లో పోటీలు నిర్వహించారు, అందులో విజేతలుగా చిరంజీవి అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో తరువాత నిర్వహించిన వివిధ రకాల ఆటలు అందర్నీ చిన్నతనాన్ని గుర్తుచేశాయి అందులో భాగంగా దివ్య మంజుల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంభం అన్యోన్యత కి సంబందించిన ఆటలో మొదటగా నిలిచిన భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు, సాంప్రదాయ వస్త్రధారణ బహుమతులలో గ్రంధి మణి మరియు లావణ్య దంపతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్ మరియు అంకిత గారి సహాయంతో మహిళలందరికీ ప్రత్యేక చిరు కానుకలు మరియు కన్యపిల్లలకి పూజలు చిరు బహుమతులు అందించడం జరిగింది. కార్యక్రమం సజావుగా జరగడంలో ముందుండి నడిపించిన వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్ మరియు సతీష్ మేడా కీలక పాత్ర పోషించడం జరిగింది.
చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టత ను వివరిస్తూ ఎప్పుడు అమ్మవారు నేర్పిన ధర్మ కార్యాలు మరువకుండా అందరు ఒక కుటుంబంవలె ఐర్లాండ్లో నివసించాలని కొనియాడారు,ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలాబాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసారు చివరిగా కార్యక్రమం స్పాన్సర్స్ గా వ్యవహరించి చేయూతనిచ్చిన southern spice రెస్టారెంట్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియచేసి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.



తాజా వార్తలు
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!









