రష్మిక మండన్నా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!

- August 14, 2023 , by Maagulf
రష్మిక మండన్నా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!

ఇటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతూనే, రష్మిక మండన్నా అటు బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా వుంది రష్మిక మండన్నా. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ రష్మిక లిస్టులో వచ్చి చేరింది.

తమిళ హీరో ధనుష్ నటించబోయే సినిమా అది. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సార్’ సినిమాతో ధనుష్ స్ర్టెయిట్ తెలుగు సినిమాలో నటించారు ఇటీవల. 

ఇంతవరకూ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ధనుష్, ‘సార్’ సినిమాతో తెలుగులోనూ డైరెక్ట్‌గా మార్కెట్ సంపాదించుకున్నారని చెప్పొచ్చు.

తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా కోసం పని చేశాడు ధనుష్. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఇంకో సినిమా చేయబోతున్నాడు. అదే ‘D 51 (వర్కింగ్ టైటిల్)’. ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

రష్మిక మండన్నా, ధనుష్ జంట తొలిసారి ఈ సినిమా కోసం జోడీ కడుతున్నారు. చూడాలి మరి, ఈ కాంబో తెరపై ఎలా వుండబోతోందో.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com