రష్మిక మండన్నా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!
- August 14, 2023
ఇటు తెలుగులో స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతూనే, రష్మిక మండన్నా అటు బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా వుంది రష్మిక మండన్నా. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ రష్మిక లిస్టులో వచ్చి చేరింది.
తమిళ హీరో ధనుష్ నటించబోయే సినిమా అది. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సార్’ సినిమాతో ధనుష్ స్ర్టెయిట్ తెలుగు సినిమాలో నటించారు ఇటీవల.
ఇంతవరకూ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ధనుష్, ‘సార్’ సినిమాతో తెలుగులోనూ డైరెక్ట్‌గా మార్కెట్ సంపాదించుకున్నారని చెప్పొచ్చు.
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా కోసం పని చేశాడు ధనుష్. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఇంకో సినిమా చేయబోతున్నాడు. అదే ‘D 51 (వర్కింగ్ టైటిల్)’. ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
రష్మిక మండన్నా, ధనుష్ జంట తొలిసారి ఈ సినిమా కోసం జోడీ కడుతున్నారు. చూడాలి మరి, ఈ కాంబో తెరపై ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







