కిడ్నీలో రాళ్లు.! ఈ జాగ్రత్తలు మీకు తెలుసా.?
- August 14, 2023
నడుము కింది భాగంలో విపరీతమైన నొప్పి, పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో అస్సలు కూర్చోవడానికే చాలా ఇబ్బంది పడిపోవడం.. ఈ లక్షణాలుంటే కిడ్నీలో రాళ్లున్నట్లుగా అనుమానించొచ్చు.
కిడ్నీలో రాళ్లకు ఒకింత జీవన శైలి కారణం కాగా, మరికొంత వారసత్వం కూడా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, కిడ్నీలో రాళ్లు మందులతో కరిగించొచ్చా.? ఎంత సైజులో వుంటే అది సాధ్యపడుతుంది.? ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ వరకూ వెళ్లాలి.? అనే అంశాలపై అవగాహన కోసం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మీకోసం.
కిడ్నీల్లో రాళ్లు రాకుండా వుండాలంటే, తగినంత నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకింత ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గముంటుంది. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతుంటే, కొన్ని జాగ్రత్తల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. అయితే, ఆరంభ సమయంలో మాత్రమే.
రాళ్లు 6 mm కన్నా తక్కువ సైజ్‌లో వుంటే, వాటిని ఆహారంలో మార్పులతో పాటూ, వైద్యులు సూచించిన మందులతో కరిగించొచ్చు. అంతకన్నా ఎక్కువ సైజులో వుంటే, మూత్రాశయ నాళాల్లో అడ్డు తగిలి, మూత్ర విసర్ఝనలో భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆపరేషన్ (ఎండోస్కోపీ) ద్వారా వాటిని తొలిగించాలి.
ఇక, ఆహారం విషయానికి వస్తే, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలను తగ్గించాలి. పాలకూర, టమోటా తక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







