ఆ హీరోయిన్‌నే కావాలంటోన్న నాగ శౌర్య.!
- August 14, 2023
ఈ మధ్య నాగ శౌర్యకు ఏదీ కలిసి రావడం లేదు. ‘రంగబలి’ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారంతా. కానీ, తుస్సు మంది. ఈ సారి రాబోయే సినిమాకి సెంటిమెంట్ వర్కవుట్ చేయాలనుకుంటున్నాడట నాగ శౌర్య.
అదేంటయ్యా.! అంటే, రష్మిక మండన్నా. ‘ఛలో’ సినిమా నాగ శౌర్య కెరీర్‌లో వన్ ఆఫ్ బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది కన్నడ ముద్దుగుమ్మ క్రష్మిక రష్మిక మండన్నా.
ఈ సినిమా ఇద్దరికీ మంచి సక్సెస్ ఇచ్చింది. రష్మిక అయితే, ఈ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసి, చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
సో, రష్మికతో మరోసారి జత కట్టాలనుకుంటున్నాడట నాగ శౌర్య. అయితే, రష్మిక ప్రస్తుతం చాలా బిజీ. ఈ నేపథ్యంలో ఒ మోస్తరయినా క్రేజ్ లేని హీరో నాగ శౌర్యతో జత కడుతుందా.? లేదంటే, తన ఫస్ట్ సినిమా హీరో అని ఏమైనా కన్సిడర్ చేస్తుందా.?
ఒకవేళ చేసినా డేట్స్ అడ్జస్ట్ చేయగలదా.? చూడాలి మరి ఏం చేస్తుందో రష్మిక.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







