40 దేశాల్లో నిర్వహించే 'కోటి@40 మ్యూజిక్ వరల్డ్ టూర్'

- August 14, 2023 , by Maagulf
40 దేశాల్లో నిర్వహించే \'కోటి@40 మ్యూజిక్ వరల్డ్ టూర్\'

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మెగామ్యూజిక్ డైరెక్టర్ సాలూరి కోటేశ్వరరావు.. కోటిగా సినిమా ప్రియులకు సుపరిచితుడు. పరిశ్రమలో అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 'కోటి@40 వరల్డ్ టూర్' అనే అద్భుతమైన కార్యక్రమానికి Investor Groves Pvt Ltd శ్రీకారం చుట్టారు.  INVESTOR GROVES PVT LTD, RAJU ENTERTAINMENTS సంస్థల అధినేతలు Investor Groves Pvt Ltd, Founder & Chairman - శ్యామ్ బాబు గంధం (IGPL Syam) , డేవిడ్ రాజు మునుకోటి నేతృత్వంలో 4 దశాబ్దాల కోటి ప్రస్తావనాన్ని ప్రపంచ స్థాయిలో వేడుక చేయడానికి ప్రీ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఆగస్టు 13న ఘనంగా ప్రారంభించారు. IGPL Production House Pvt Ltd Founder & Chairman  (IGPL Syam) సంస్థను స్థాపించి రియేల్టర్ గా, ఇన్వెస్టర్ గా, సామాజికవేత్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామ్ బాబు గంధం. అలాగే రాజు ఎంటర్ టైన్మెంట్ ఆధ్వర్యంలో డెవిడ్ రాజు మునుకోటి పొలిటికల్, సోషల్ ఈవెంట్స్, బిగ్ కాన్సెర్ట్స్, అలాగే స్పోర్ట్స్ కు సంబంధించిన ఈవెంట్స్ చేయడంలో పేరుగాంచారు. 

40మంది వాయిద్య బృందంతో పాటు 40మంది గాయకులు, ఆయన సూపర్ హిట్ 40 పాటలతో అలరించారు. 40దేశాలలో నిర్వహించబోయే సంగీత ప్రపంచ విహారాన్ని మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అతిరథ మహారధుల సమక్షంలో జస్టిస్ ఎన్వీ రమణ 40 సంవత్సరాలుగా సంగీత ప్రియులను ఉర్రుతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటిని లెజెండరీ మెగా మ్యూజిక్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్వి రమణగారు మాట్లాడుతూ.. 

సినిమా పరిశ్రమలో సంగీతం, సాహిత్యం అంటే కొంతమంది గుర్తుకు వస్తారు. అదే కొంతమందిని చూస్తే సంగీత సాహిత్యం గుర్తుకువస్తుంది. అలాంటి వారిలో సాలూరు రాజేశ్వరరావు, గంటసాల గుర్తుకు వస్తారు. వారి తరువాత అదే వరుసలో ఆతరం నుండి ఈ తరానికి వారధిగా.. సంగీత ప్రియులకు సారధిగా ఉన్న సాలూరి కోటేశ్వరరావు సినిమా రంగంలో కోటిగా గుర్తింపు తెచ్చుకొని సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. 

సాలూరి రాజేశ్వర్ రావు, ఆయన తండ్రి, ఆయన తనయుడు ఇలా సాలూరు వంశీయులు మొత్తం సంగీత ప్రపంచంలో అనేక సేవలు అందించారు. అదేవిధంగా ఈ తరానికి స్ఫూర్తిగా కోటి నిలిచారన్నారు. కోటి శాస్త్రీయ సంగీతము ఒక్కటే కాదు యువతలో స్ఫూర్తి నింపే సాహిత్యాన్ని అందించారని పేర్కొన్నారు. సంగీతం మానసిక రుగ్మతలను తొలగిస్తుందని తమ కాలంలో సాహిత్య విలువలతో కూడిన పాటలు ఎక్కువగా ఉండేవని కానీ ఇప్పుడు అధునాతన సంగీతం ఎక్కువగా వినిపిస్తుందని వెల్లడించారు. అలాగే తెలుగు సినిమా సంక్షితం ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఆస్కార్ అవార్డును కైవసం చేసుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం అని జస్టిస్ ఎండి రమణ పేర్కొన్నారు. ఇక కోటి 40 సంత్సరాల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని 40 దేశాల్లో 40 మంది సంగీత కారులతో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన  IGPL Production House Pvt Ltd Founder & Chairman IGPL శ్యామ్, Raju Entertainer  డేవిడ్ రాజు మునుకోటి, మాజీ న్యాయమూర్తి మాధవ్ లకు ఆయన అభినందనలు తెలిపారు. వీరు చేపట్టిన చైత్ర యాత్ర ఘన విజయం సాధించాలని సభా నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా అన్న సినిమా కళాకారులన్న ప్రత్యేక అభిమానమని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ముఖ్యంగా మన తెలుగు భాష కళాకారులు మన సంస్కృతిని మన భాషను సగర్వంగా ముందుకు తీసుకెళుతున్నందుకు అలాగే తెలుగు భాష అభివృద్ధిలో కృషి చేస్తున్న కళాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. 

సీనియర్ యాక్టర్ నరేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు జడ్జి మాధవ్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అన్నట్లు కోటి సినిమా ప్రపంచంలో తనదైన శైలిలో శ్రమించి సంగీత ప్రపంచంలో మహా పురుషుడిగా ఎదిగారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోటి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోటి@40 వరల్డ్ మ్యూజిక్ టూర్ నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ప్రపంచంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇలాంటి కార్యక్రమం జరగలేదని, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదు కావలసిన విషయమని కొనియాడారు.

కోటి మాట్లాడుతూ.. ముందుగా కార్యక్రమానికి వచ్చిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కోటి@40 కి విచ్చేసిన ముఖ్యఅతిథిలకు అభిమానులకు అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన ఐజీపీఎల్‌ ఫౌండర్‌ , నిర్మాత గంధం శ్యాంబాబు, రాజు ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మునుకోటి రాజులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ రమణ రావడం దీనికి కారణమైన మాజీ న్యాయమూర్తి ఆర్‌.మాధవరావుకు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కోటి ప్రస్థానం ఇంత ఘనంగా ముందుకు సాగుతుంది అంటే అది కేవలం ఆయన తండ్రి రాజేశ్వరరావు ఆశీస్సులను తెలిపారు. ఆయన జీవితంలో ఎంతో మందికి రుణపడి ఉన్నానని అందులో మోహన్ బాబు, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇంకా ఎందరో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ వందనాలు అన్నారు.

తెలుగు సాహిత్యంలో కోటి ప్రస్తావన వస్తే ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు రాజ్ ప్రస్తావన కచ్చితంగా వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు రావాల్సి ఉండనని కానీ వారి వారి అనివార్య కారణాల వలన వారు రాలేకపోయారని..  అయినా సరే నేను ఎప్పుడూ వారి ఆత్మీయుడినని పేర్కొన్నారు. ఆయన సంగీత ప్రస్థానంలో ఎంతోమంది రచయితల రచనలకు మ్యూజిక్ అందించాలని ఈ సందర్భంగా వేటూరి సుందర మూర్తి ని గుర్తు చేశారు అలాగే ఆయన సంగీత సారధ్యంలో ఎస్పి బాలసుబ్రమణ్యం, జానకి, చిత్ర, మను ఈ తరంలో గీతామాధురి, సింహ తదితరులు అద్భుతంగా పాడారని వారిని కొనియాడారు. ఈ సందర్భంగా తనగాప్తంతో సంగీత ప్రియులను మైమరిపింపజేసిన ఎస్పి బాలసుబ్రమణ్యంను గుర్తు చేసుకున్నారు. 45 దేశాల్లో ఈ కార్యక్రమం అద్భుతంగా చేయబోతున్నట్లు ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఐజిపిఎల్ లోగోను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ రావడం  నిజంగా అదృష్టమని మాజీ న్యాయమూర్తి మాధవరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జయసుధ మాట్లాడుతూ.. పరిశ్రమలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగీత దర్శకుడు కోటికి, కోటి@40 కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కోటితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఆయన సంగీతం ఎంతో అద్భుతంగా ఉంటుందని, సినిమా పరిశ్రమలో కోటి అంటే ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని 40 దేశాల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని తెలిపారు.

అలాగే అనివార్య కారణాల వలన రాలేకపోయినా చిరంజీవి కోటికి వీడియో రూపంలో సందేశాన్ని పంపించారు. కోటి తనకు ఆత్మ మిత్రుడని తమ కుటుంబంలో సభ్యుడని పేర్కొన్నారు. మెగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి నిజమైన అర్హుడని వెల్లడించారు. అలాగే అక్కినేని నాగార్జున వీడియో సందేశంలో అభినందనలు తెలపగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటన రూపంలో కోటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కోటి@40 మ్యూజిక్ వరల్డ్ టూర్ కార్యక్రమాన్ని 45 దేశాల్లో ఘనంగా నిర్వహించబోతున్నామని ఫ్రీ లాంచ్ ఈవెంట్ లో నిర్వాహకులు శ్యాంబాబు, రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి మాధవరావు, జయసుధ, రమణ గోగుల, రోజారమని, సినీయర్ నరేష్, కోదండ రామ్ రెడ్డి, బీ. గోపాల్ తదితరులు వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com