మోటోజీపీ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ఎర్లీబర్డ్ టిక్కెట్లపై భారీ తగ్గింపు..!
- August 15, 2023
దోహా: లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) ఖతార్‌కు చెందిన MotoGP ఖతార్ ఎయిర్వేస్ గ్రాండ్ ప్రిక్స్ కోసం ఎర్లీ బర్డ్ టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. రేసులు నవంబరు 17-19 వరకు పునరుద్ధరించబడిన లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరుగుతాయి. MotoGP ఖతార్ రాత్రిపూట జరిగే ఏకైక రేసుగా నిల్వనుంది. అభిమానులకు మరింత చేరువయ్యేలా టిక్కెట్ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్ కేటగిరీలలో మెయిన్ గ్రాండ్‌స్టాండ్, జనరల్ అడ్మిషన్ (లుసైల్ హిల్), హాస్పిటాలిటీ ఉన్నాయి. ఈ ప్రారంభ దశలో కొనుగోలు చేసిన టిక్కెట్లపై 20% ప్రత్యేక తగ్గింపుతో వాటిని మొత్తం వారాంతం లేదా ఏ ఒక్క రోజుకైనా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అభిమానులు వారి ప్రియమైన పిల్లలతో కలిసి రేసింగ్ ను ఆనదించేందుకు కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సాధారణ అడ్మిషన్ టిక్కెట్‌తో పెద్దవారితో కలిసి మూడు రోజులపాటు ఉచితంగా హాజరు కావచ్చు. టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పిల్లల కోసం ఒక స్థలాన్ని బుక్ చేసుకోవచ్చు. MotoGP యొక్క 21 ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించామని, 22వ ఎడిషన్‌ను 2023లో తిరిగి లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు స్వాగతించడానికి ఎదురుచూస్తున్నట్టు ఖతార్ మోటార్, మోటార్ సైకిల్ ఫెడరేషన్ (QMMF) , లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ప్రెసిడెంట్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్లతీఫ్ అల్ మన్నాయ్ తెలిపారు. లుసైల్ సర్క్యూట్ స్పోర్ట్స్ క్లబ్ ఎర్లీబర్డ్ టిక్కెట్ల ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







