ప్రపంచకప్ టికెట్ కావాలా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
- August 15, 2023
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా టికెట్ల అమ్మకంపై ఐసీసీ(ICC) ఫోకస్ పెట్టింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వాళ్లు టికెట్ల కొరకు వెబ్సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ భారత స్వాత్రంత్య్ర దినోత్సవం అయిన నేటి(ఆగస్టు 15) మధ్యాహ్నాం 3.30 గంటల నుంచి ప్రారంభమైనట్లు వెల్లడించింది.
ఇలా రిజిస్టర్ చేసుకోండి...
వెబ్సైట్లో టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల 25 నుంచి టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. http://www.cricketworldcup.com/registerసైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సైట్లోకి వెళ్లగానే పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఏ దేశానికి చెందిన వారు, ఏ మైదానంలో మ్యాచ్‌లను చూడాలని అనుకుంటున్నారు. ఏ దేశ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్నారు అనే వివరాలు కనిపిస్తాయి. వాటిని నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగానే వెంటనే మీకు మెయిల్ ద్వారా లేదంటే ఫోన్‌కు సమాచారం అందిస్తారు.
ప్రపంచకప్‌కు టికెట్లు ఈ తేదీల్లో విక్రయించబడతాయి
ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మదబాద్‌లో జరిగే భారత మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు లను విక్రయిస్తారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







