సౌదీలో నెలరోజుల్లో 2,000 మైనింగ్ సైట్లలో తనిఖీలు
- August 16, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలోని అనేక మైనింగ్ సైట్‌లలో జూలై నెలలో 2,013 తనిఖీ పర్యటనలను పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ (MIM) నిర్వహించింది. మైనింగ్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన సంస్థలపై MIM 101 జరిమానాలు జారీ చేసింది. ఇందులో లైసెన్స్ షరతులు పాటించడంలో విఫలమైనందుకు 49 జరిమానాలు, లైసెన్స్ పరిమితిని అతిక్రమించి మైనింగ్ చేసినందుకు 26 జరిమానాలు, గడువు ముగిసిన లైసెన్స్‌తో పనిచేసినందుకు 24 జరిమానాలు, లైసెన్స్ పొందకుండా పని చేసినందుకు 2 జరిమానాలు ఉన్నాయి.
జర్రా అల్-జర్రాహ్, మక్కా ప్రాంతంలోని కంపెనీలకు అత్యధికంగా 29 పెనాల్టీలు విధించారు. ఆ తర్వాత మదీనా ప్రాంతం 19 జరిమానాలతో.. ల్-జౌఫ్ ప్రాంతం 11 పెనాల్టీలతో స్థానాల్లో ఉన్నాయి. రియాద్ ప్రాంతం 9 పెనాల్టీలను నమోదు చేసింది. అసిర్ మరియు అల్-షర్కియా ప్రాంతాలు ఒక్కొక్కటి 7, అల్-ఖాసిమ్ ప్రాంతం 6, ఉత్తర సరిహద్దు 5, జజాన్ ప్రాంతం 4, హేల్ ప్రాంతం 2 మరియు నజ్రాన్ ప్రాంతం 1 చొప్పున ఉల్లంఘనలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మైనింగ్ కార్యకలాపాలను అనుసరించడానికి మరియు చట్టవిరుద్ధమైన పద్ధతుల నుండి ఈ రంగానికి రక్షణ కల్పించడానికి తనిఖీ పర్యటనలను నిరంతరం కొనసాగించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని ఖనిజ నిక్షేపాల విలువ సుమారు SR5 ట్రిలియన్లుగా అంచనా వేయబడినందున జాతీయ ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, చమురుయేతర ఆదాయాలను అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రను పోషించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







