వచ్చే వారం గ్రేటర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ : మంత్రి కెటిఆర్
- August 16, 2023
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. తొలివిడతలో దాదాపు 75 వేలకు పైగా డబుల్ బెడ్రూంలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈమేరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లతో ఆయన సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా హాజరైన ఈ భేటీలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తికావచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, పేదలకు పంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 70 వేల ఇళ్లతో పాటు చివరి దశలో ఉన్న మరో ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు. గ్రేటర్ లో ఇప్పటికే 4,500 లకు పైగా ఇళ్లను లబ్దిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికలో రాజకీయ నేతల జోక్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కెటిఆర్ వివరించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పరిశీలించి, అర్హులను గుర్తించిందని చెప్పారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







