నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు
- August 16, 2023
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా ఖరారు చేసింది. ఈ మేరకు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ నృపేంద్ర మిశ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పేరును అధికారికంగా మార్చారు. ప్రజాస్వామీకరణ క్రతువులో భాగంగా ఈ మార్పు చేసినట్టు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
సొసైటీ వైస్ ప్రెసిడెంట్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జూన్‌లో జరిగిన ఓ సమావేశంలో పేరుమార్పు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని విధానపరమైన లాంఛనాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14 నుంచి కొత్త పేరు అమల్లోకి రావాలని అప్పట్లో మ్యూజియం అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







