‘భ్రో’ నిర్మాత అలా.! ‘భోళా శంకర్’ నిర్మాత ఇలా.!
- August 16, 2023
మెగా కుటుంబం నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు.. నెగిటివిటీ బ్యాచ్ కాసుక్కూర్చుంటుంది ఆ సినిమాని ఎలా తొక్కేయాలా అని.! తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన ‘బ్రో’, ‘భోళా శంకర్’ సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది.
‘బ్రో’ని తొక్కేయడానికి అష్ట కష్టాలూ పడింది సో కాల్డ్ తొక్కేసే బ్యాచ్. కానీ, నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ చాలా గట్టిగా నిలబడ్డాడు. ఈ సినిమాని బాధ్యతగా తీసుకున్నాడు. మీడియాతో కంటిన్యూస్‌గా ఇంటరాక్ట్ అవుతూ వచ్చాడు.
నెగిటివ్ వార్తల్ని గట్టిగా చాలా గట్టిగా ఖండించాడు. ఈ విషయంలో ఆయన్ని సినీ వర్గాల్లో అందరూ మెచ్చుకున్నారు. అలా ‘బ్రో’ ఎలాగో నెట్టుకొచ్చేసింది.
కానీ, ‘భోళా శంకర్’ విషయంలో అంతా రివర్స్‌లో జరిగింది. ఈ సినిమాని నిర్మాత అనిల్ సుంకర అస్సలు పట్టించుకోలేదు. టి.జి విశ్వ ప్రసాద్‌తో పోల్చితే, అనిల్ సుంకర ఇంకా గట్టిగా నిలబడొచ్చు. ఎందుకంటే చిరంజీవి ఈ సినిమాని పూర్తి బాధ్యతగా తీసుకున్నారు. అంతా తానేయై సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. కానీ, అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
రిలీజ్ తర్వాత గతంలో చిరంజీవి ఏ సినిమాకీ రానంత నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది ‘భోళా శంకర్’పై. దాంతో, చిరంజీవి కూడా ఏం చేయలేకపోయాడు. ‘బ్రో’ నిర్మాతలా ‘భోళా శంకర్ నిర్మాత కూడా బాధ్యతగా వుంటే సీను మరోలా వుండేది.. అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్









