విజయవాడలో సమంత ఇడ్లీ బండి.! ఏంటీ కథ.!
- August 16, 2023
విజయవాడలో సమంత ఇడ్లీ బండి.? ఏంటీ అనుకుంటున్నారా.? ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ టైమ్‌లో విజయ్ దేరకొండ చేసిన వ్యాఖ్యలివి. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. అందుకు కారణం తాజాగా సమంత ఈ మాటల్ని మరోసారి ప్రస్థావించడమే.
అసలు విషయమేంటంటే, ‘ఖుషి’ సినిమా అసలు సమంత పూర్తి చేస్తుందో లేదో అనుకున్నారంతా. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా. ఎలాగోలా పూర్తి చేసేసింది. అయితే, ఎప్పడు పూర్తయినా ఈ సినిమాని కేవలం సమంతతోనే పూర్తి చేయాలని అనుకున్నారట విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ.
అందుకోసం నాలుగైదేళ్లు కాదు, పదేళ్లయినా వెయిట్ చేయాలనుకున్నారట. కాస్త టూమచ్‌గా వున్నప్పటికీ.. ఈ సందర్భంలోనే విజయవాడ హైవేపై సమంత పేరుతో ఇడ్లీ స్టాల్ ఓపెన్ చేయాలనుకున్నాం.. అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు.
‘థాంక్ గాడ్ సమంత ఇడ్లీ స్టాల్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి రాలేదు..’ అంటూ తాజాగా సమంత ప్రస్థావించింది. ఇప్పుడీ సమంత ఇడ్లీ బండి వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. కొందరు ఏంటిది మరీ చీప్‌గా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









