‘ఖుషి’కి ఆ పబ్లిసిటీ సరిపోతుందా.?
- August 16, 2023
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ ఈవెంట్ అందర్నీ ‘ఖుషి’ సినిమా వైపు అటెన్షన్ పెరిగేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కాగా, తాజా ఈవెంట్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.
సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అనారోగ్య సమస్య కారణంగానే ఆమె తాత్కాలికంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఎక్కువగా లైటింగ్‌ని సమంత తట్టుకోలేదనీ, కళ్లు మండడం, విపరీతమైన తలనొప్పి రావడం.. వంటి సమస్యలు వచ్చి సమంత చాలా ఇబ్బంది పడుతుందని ఆమె అనారోగ్యం గురించి విజయ్ దేవరకొండ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు సమంత ఆరోగ్యంపై కొంత అనుమానం కలిగేలా చేస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు కూడా సమంత అనారోగ్య సమస్యే పబ్లిసిటీ ఎలిమెంట్ అయ్యింది. అయితే, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయ్. సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. మరి, ఇప్పుడు కూడా ‘ఖుషి’ టీమ్ అదే చేస్తుందే.! రిజల్ట్ ఎలా వుండబోతోందో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







