భారత్ లో భారీ వరదలు. సంతాపం తెలిపిన కువైట్
- August 17, 2023
కువైట్: భారత్ లో ఇటీవల తలెత్తిన వరదలకు ప్రాణనష్టం జరగడంపై హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంతాపాన్ని తెలియజేశారు. వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత రాష్ట్రపతికి సంతాపాన్ని తెలుపులూ లేఖలు పంపారు. దేశంలోని ఉత్తరాన ఆకస్మిక వరదలు సంభవించి డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సానుభూతి, సంఘీభావం తెలిపింది. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో సంతాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







