యూఏఈ ఎన్నికలు: మొదటి రోజున 160 రిజిస్ట్రేషన్స్

- August 17, 2023 , by Maagulf
యూఏఈ ఎన్నికలు: మొదటి రోజున 160 రిజిస్ట్రేషన్స్

యూఏఈ: యూఏఈ పార్లమెంటరీ సంస్థ అయిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)కి పోటీ చేయాలనుకునే వారి నుండి అభ్యర్థనలను స్వీకరణ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల కమిటీ వ్యక్తిగతంగా, ఎలక్ట్రానిక్‌గా నమోదు అభ్యర్థనలను స్వీకరిస్తోంది. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆసక్తిగల అభ్యర్థులు దేశం లోపల లేదా బయట ఉన్నా సులభంగా నమోదు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు జాతీయ ఎన్నికల కమిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌లు వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. ఆగస్టు 18 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ మొదటి రోజు అన్ని ఎమిరేట్స్ నుండి మొత్తం 162 అభ్యర్థిత్వ అభ్యర్థనలు వచ్చాయి. అబుదాబికి 58, దుబాయ్‌కి 23, షార్జాకు 29, అజ్మాన్‌కు 12, ఉమ్ అల్-క్వైన్‌కు 12, రస్ అల్ ఖైమాకు 19, ఫుజైరాకు 9 అభ్యర్థనలు అందాయి.  ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల కాలక్రమం ప్రకారం.. జాతీయ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఆగస్టు 25న ప్రకటిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థులకు అభ్యంతరాలను సమర్పించే వ్యవధి వెంటనే ప్రారంభమవుతుంది. అభ్యర్థుల తుది జాబితా సెప్టెంబర్ 2న ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు తమ ఎన్నికల కార్యక్రమాలను, ప్రచారం చేయడం ప్రారంభించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com