మృణాల్ ఠాకూర్ అంతలా పెంచేసిందా.?
- August 17, 2023
‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే మృణాల్‌కి ఎక్కడ లేని గుర్తింపు తెచ్చి పెట్టేసింది. ఇంతవరకూ మృణాల్ నుంచి రిలీజైన సినిమా ఇదొక్కటే. కానీ, ఆమె పేరు మాత్రం ఇండస్ర్టీలో తెగ నానుతోంది.
ప్రస్తుతం మృణాల్ నాని హీరోగా ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటూ, మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో వున్నట్లు తెలుస్తోంది.
అయితే, మృణాల్ గురించి ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది తాజాగా. ఆమె రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తోందట. ఇటీవల ఓ దర్శకుడు ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో మృణాల్ వద్దకు వెళ్లగా ఊహించని రెమ్యునరేషన్ చెప్పిందట.
దాంతో, ఆ డైరెక్టర్ వెనుకడుగు వేశాడట. ఆ ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం వేటాడుతున్నాడట. అయితే, క్రేజ్ వున్నప్పుడే వాడుకోవాలి మరి. ఇప్పుడామెకి ఆ రేంజ్ క్రేజ్ వుంది.
సో, వాడుకోవడంలో తప్పేముంది.! అన్నట్లు నాగార్జున సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, మరికొంతమంది యంగ్ హీరోలు కూడా మృణాల్ కోసం వెయిటింగ్ లిస్టులో వున్నారట.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







