‘దేవర’ లేటెస్ట్ అప్‌డేట్.! కథ అదేనట.!
- August 17, 2023
యంగ్ టైగర్ ఎన్టీయార్ తాజా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘దేవర’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా విలన్ రోల్‌ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన క్యారెక్టర్ పేరు ‘బైరా’గా ప్రస్థావించారు.
‘దేవర’, ‘బైరా’.. పేర్ల చివర ‘ర’ కామన్‌గా వుండడంతో, వీరిద్దరూ అన్నదమ్ములై వుంటారనీ సోషల్ మీడియాలో కొందరు కథనాలు వేడి వేడిగా వడ్డించేస్తున్నారు.
ఇంకొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి వీరిద్దరి మధ్యా వైరాన్ని కూడా కథలుగా అల్లేస్తున్నారు. అన్న అరాచకాలను ఖండించే తమ్ముడి కథే ‘దేవర’ అంటూ ప్రచారం చేస్తున్నారు.
అసలు కథేంటన్నది ముందు ముందు తెలియాల్సి వుంది. చావంటే భయం లేని మానవ మృగాలకి చావు భయం చూపించే వ్యక్తి కథే.. ‘దేవర’ అని కొరటాల శివ ఫస్ట్ లుక్ ద్వారా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంటే ఈ సినిమాలో విలన్ రోల్ ఎంత పవర్ ఫుల్‌గా వుండబోతోందో కొరటాల శివ ఎప్పుడో చెప్పకనే చెప్పేశారన్న మాట. అన్నట్లు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







