‘సూపర్’ అప్డేట్ ఇంకెప్పుడు జక్కన్నా.!
- August 17, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చి ఇన్నాళ్లు గడుస్తున్నా.. ఇంకా రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అదేనండీ.! ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్ర్కిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజున రాజమౌళి నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, రాలేదు.
ఓ వైపు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నప్పటికీ, రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ పైనే ఫ్యాన్స్‌లో ఎక్కువ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ జక్కన్న తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సూటిగా జక్కన్నను ప్రశ్తిస్తున్నారు.
మా హీరో సినిమా అప్డేట్ ఎప్పుడంటూ.! అంతే మరి, ఎప్పటి ‘బాహుబలి’ సినిమా.. అప్పటికీ ఇప్పటికీ ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులొచ్చినా ప్రబాస్ ఇమేజ్‌కి ఏ మాత్రం మకిలి అంటలేదు. జక్కన్న సినిమానా మజాకానా.? ఆ రేంజ్లో వుంటుంది మరి.
ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీయార్‌లు గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇక మహేష్ బాబు నుంచి ఆ రేంజ్ క్రేజ్ ఎప్పడెప్పుడా అని ఫ్యాన్స్‌లో కుతూహలం వుండడంలో ఆశ్చర్యమేముంది వుంటుంది మరి.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







