52 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్‌తో లులూ డైరెక్టర్ రీయూనియన్. Dh220,000 విరాళం
- August 17, 2023
యూఏఈ: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కరాంచీరాలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌లో 52 ఏళ్ల తర్వాత యూఏఈ వ్యాపారవేత్త M. A. యూసఫ్ అలీ(లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్) తన క్లాస్ మేట్స్, మాజీ ఉపాధ్యాయులతో రీయూనియన్ అయ్యారు. అంతకుముందు ఆయనకు స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం తరగతి గదిలో తన బ్యాచ్‌మేట్స్‌తో మాట్లాడారు. యూసఫ్ అలీ తన గురువుకు నమస్కరించి సత్కరించారు. సహవిద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేశారు. అతను బయలుదేరే ముందు తన పాఠశాల నిధికి సుమారు Dh220,000 విరాళం అందజేశాడు.
1973లో మొదటిసారిగా యూఏఈకి చేరుకున్న యూసఫ్ అలీ తన మామకు కిరాణా దుకాణంలో సహాయం చేస్తూ నగరంలో తన పనిని ప్రారంభించాడు. తన చురుకైన వ్యాపార చతురతతో అతను 1990లలో లులు గ్రూప్ ఆఫ్ హైపర్ మార్కెట్‌ను స్థాపించాడు. యూఏఈలోని రిటైల్ ల్యాండ్‌స్కేప్‌ను క్రమంగా విస్తరించాడు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ 2015లో గ్రేట్ స్కాట్లాండ్ యార్డ్‌ను 550 మిలియన్ దిర్హామ్‌లకు కొనుగోలు చేసింది. తరువాత Dh250 మిలియన్ విలువైన హోటల్ మేక్ఓవర్‌ను పూర్తి చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







