బంపరాఫర్. ఫ్లైట్ టిక్కెట్ ధరను వాయిదాలలో చెల్లించవచ్చు..!
- August 17, 2023
యూఏఈ: ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించే అవకాశాన్ని సౌదీ ఎయిర్ క్యారియర్ ఫ్లైనాస్ అందిస్తుంది. ఇటీవలే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్‌ను ప్రకటించింది. షాపింగ్, ఇతర ఆర్థిక సేవల కోసం ఉపయోగించే యాప్ అయిన టాబీతో పార్టినర్షిప్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ డిమాండ్ పెరగడంతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు ఫ్లైనాస్ వెల్లడించింది. 51 విమానాల సముదాయంతో ఫ్లైనాస్ సౌదీ అరేబియాలో మరియు దుబాయ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు సేవలను అందిస్తున్నది. జూలైలో స్కైట్రాక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో వరుసగా 6వ సారి ప్రపంచంలోని నాల్గవ అత్యుత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా.. మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ తక్కువ-ధర క్యారియర్‌గా పేరుపొందింది. ఫ్లైనాస్తో ప్రయాణించే ప్రయాణీకులు తమ విమాన సర్వీసులను ఎయిర్‌లైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా యాప్ లేదా 24/7 కాల్ సెంటర్ (920001234) లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







