ఎడారిలో వికసించిన కమలం...అబుధాబి BAPS హిందూ మందిర్
- August 18, 2023
అబుధాబి: అబుధాబిలో చారిత్రాత్మక మరియు ఐకానిక్ BAPS హిందూ మందిర్ ప్రారంభోత్సవం 2024 ఫిబ్రవరి 14న జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ని బ్రహ్మవిహారి స్వామి కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్‌కి ఓ ప్రత్యేకమైన దండను అందించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మహిళా వాలంటీర్లు అత్యంత శ్రద్ధతో ఈ దండను రూపొందించారు. దానిలోని ప్రతి భాగం సింబాలిక్ అర్థాన్ని కలిగి ఉంది. గులాబీ బంగారు తాటి ఆకులపై భగవాన్ స్వామినారాయణ్ యొక్క 108 పేర్లను చేతితో వ్రాసి ఉంటుంది. ప్రతి ఆకులో ఖర్జూరం ఆకారంలో ఉండే కుంకుమపువ్వు ఒక సువాసనను వెదజల్లుతుంది. మధ్యలో ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ చిహ్నం ఏర్పాటు చేశారు. ఆనంతరం పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ తన ఉపన్యాసంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. దేవుడి దివ్య సంకల్పం వల్లే మందిర నిర్మాణం జరుగుతోందని.. మందిరంలో ఉన్న విలువలు మనుషులతో, ప్రపంచంతో మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను చెబుతూ "మందిరం ఎడారిలో వికసించిన కమలం లాంటిది" అని ఆయన అభివర్ణించారు. ఈ మందిరం ప్రపంచం, మానవత్వం మరియు భవిష్యత్తుపై తనదైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







