దేవినేని అవినాష్ ఇంటికి సీఎం జగన్
- August 18, 2023
విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ఆయన ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు. సీఎం జగన్.. అవినాష్ ఇంటికి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తమ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను దేవినేని అవినాష్ తన ఇంటికి ఆహ్వానించారు. అవినాష్ ఆహ్వానం మేరకు సీఎం జగన్.. ఆయన ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తన ఇంటికి విచ్చేసిన జగన్ కు అవినాష్ సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తమ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అరగంట పాటు అవినాష్ నివాసంలో గడిపిన తర్వాత సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లికి తిరిగి వెళ్లారు.
కాగా, హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, జోగి రమేశ్, తానేటి వనితతో పాటు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. హయత్ ప్లేస్ చైర్మన్ ఆర్ వీరాస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ సిహెచ్ రామకృష్ణ తదితరులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







