మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం
- August 19, 2023
అమరావతి: ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్తి పలికినట్టు వెల్లడించింది. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో అవి పోస్ట్‌లో వారివారి ఇళ్లకు పంపిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కో కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్ కింద మరో రూ.25 తీసుకుని కార్డులను ప్రజల ఇళ్లకు పోస్టులో పంపించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఏపీ కూడా డిజిటల్ బాట పట్టింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు రవాణా శాఖ వెబ్ సైట్ లేదా ఏపీఆర్‌టీఏసిటిజన్, ఈప్రగతి, ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రాలను తీసుకోవాలి. ఏపీఆర్‌టీఏసిటిజన్ ఆండ్రాయిడ్ యాప్‌తోనూ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనాల తనిఖీల సమయంలో యాప్‌లోని డిజిటల్ సర్టిఫికేట్లను ప్రభుత్వ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని అనుమతించాలని సంబంధిత అధికారులకూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







