ఐసీసీ ప్రపంచ కప్ మస్కట్లు విడుదల
- August 20, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో వన్డే ప్రపంచకప్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఈసారి ప్రపంచకప్ ఎవరిదనే చర్చే జరుగుతోంది. ఈసారి వన్డే ప్రపంచ కప్ ను ఒడిసిపట్టాలన్న సంకల్పంతో అన్ని జట్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు నెలన్నర రోజులే సమయం ఉండడంతో అన్ని జట్లు తుది జట్లను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ(ICC)ప్రపంచ కప్ మస్కట్ లను విడుదల చేసింది. క్రికెట్‌లో పురుషులు, మహిళలు సమానమే అనే ఉద్దేశంతో ICC ఈ మస్కట్లను తెచ్చింది. గురుగ్రామ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అండర్ -19 వరల్డ్ కప్ విజేతలు యశ్ ధూల్, షఫాలీ వర్మ సమక్షంలో వీటిని ఆవిష్కరించారు. పురుషుల మస్కట్ నీలి రంగుల , మహిళల మస్కట్ ఎరపు రంగులో ఉన్నాయి. వరల్డ్ కప్ పోటీల ముందు మస్కట్‌లను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సీసీ ఈవెంట్స్ అధ్యక్షుడు క్రిస్ టెట్లీ వెల్లడించాడు. మహిళల మస్కట్ ద్వారా ఈ లోకంలోని సమానత్వం, వైవిధ్యాన్ని చాటుతున్నామని తెలిపారు. తర్వాతి తరం అభిమానులకు చేరువయ్యేందుకు ఈ మస్కట్‌లు ఎంతో ఉపయోగపడతాయని టెట్లీ తెలిపారు. క్రికెట్ మీదున్న ప్రేమను ప్రపంచానికి చూపేందుకు ఈ రెండు మస్కట్‌లు దోహదపడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







