ట్రాఫిక్ ఫైన్ కట్టని 8 మంది ప్రవాసుల ప్రయాణంపై ఆంక్షలు..!
- August 21, 2023
కువైట్: కువైట్ విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానా తప్పనిసరిగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమలు చేసిన మొదటి రోజున 35,000 దినార్లు ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేశారు. కొత్త నిబంధన ఆగస్టు 19వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. మొదటి రోజు 8 మంది ప్రవాసులను అడ్డుకున్నారు. వారు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా పోర్ట్‌లో జరిమానా చెల్లించలేకపోవడంతో వారి ప్రయాణాన్ని అధికులు అడ్డుకున్నారు. దీంతో వారి ప్రయాణంలో జాప్యం ఎదుర్కొన్నారు. కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఆగస్ట్ 19 నుండి ప్రవాసులకు దేశం విడిచి వెళ్లడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించడం తప్పనిసరి అయింది. అందువల్ల సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద ప్రయాణ జాప్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ వారు బయలుదేరే ముందు ట్రాఫిక్ ఉల్లంఘనలను చెక్ చేసుకొని చెల్లించాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







