యూఏఈలో ప్రారంభమైన ‘బ్యాక్ టూ స్కూల్’ షాపింగ్ సందడి
- August 21, 2023
యూఏఈ: ఎమిరేట్ వ్యాప్తంగా బ్యాక్ టూ స్కూల్ షాపింగ్ సందడి మొదలైంది. చాలా పాఠశాలలు ఆగష్టు 28న పునర్ ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. దుబాయ్‌లోని కరామాలో తన కుమారుల కోసం యూనిఫామ్‌ల కోసం షాపింగ్‌కు వెళ్గాగా ఒక ప్రముఖ స్టోర్ వెలుపల పొడవైన క్యూలను చూసినట్లు మహీన్ హెచ్ తెలిపారు. మరోవైపు చాలా మంది ఎమిరేట్స్ నివాసితులు తమ వేసవి సెలవుల తర్వాత దేశానికి తిరిగి రావడంతో రోడ్లపై ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా వారంతంలో వందలాది మంది కస్టమర్లు తమ స్టోర్లను సందర్శించారని ఒక ప్రముఖ యూనిఫాం కంపెనీ వెల్లడించింది. రద్దీ నెలకొనకుండా అపాయింట్మెంట్లను ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవాలని తాము పేరెంట్స్ ను కొరుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్స్ త్వరలోనే ప్రారంభం అవుతుండటంతో తన ముగ్గురు పిల్లలకు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు దుబాయ్ మాల్‌ను సందర్శించిన సమయంలో భారీగా రద్దీ ఉందని అదీల్ అహ్మద్ అనే భారతీయ ప్రవాసుడు వెల్లడించారు. సేల్స్పర్సన్లు చాలా బిజీగా ఉన్నారని, క్యాష్ కౌంటర్ వద్ద చాలా క్యూలు ఉన్నాయని, తాను చెల్లించడానికి దాదాపు 40 నిమిషాలు వేచి ఉన్నట్టు అతను తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!







