బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
- August 21, 2023
హైదరాబాద్: తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 115 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బిఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు. ఇక కెసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేయనున్నారు.
2023 ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఆరేడుగురు మాత్రమే సిట్టింగ్‌లను తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్‌లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలను తలదన్ని తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తోంది దేశంలోనే తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కర్ణాటకలో తెలిసిపోయిందన్నారు.
తెలంగాణలో మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతోందన్నారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్‌లో 29 సీట్లకు ఇరవై తొమ్మిది తామే గెలుస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచినట్లు చెప్పారు.
అభ్యర్థుల పూర్తి జాబితా..




తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







