ICBF ఆధ్వర్యంలో ఘనంగా 'భారత్ ఆజాదీ కే రంగ్ 2023'
- August 21, 2023
దోహా: భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 18న ICBF ఆధ్వర్యంలో "భారత్ ఆజాదీ కే రంగ్ 2023"ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారతదేశ స్వాతంత్య్రాన్ని స్మరించుకునేలా చేశాయి. రస్లాఫ్ఫాన్, మెస్సైద్, ధుఖాన్, అల్ ఖోర్ మరియు ఇండస్ట్రియల్ ఏరియా వంటి వివిధ ప్రాంతాల నుండి కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా ఖతార్ లో భారత రాయబారి హెచ్.ఇ. విపుల్, ICBF సమన్వయ అధికారి, భారత రాయబార కార్యాలయ మొదటి కార్యదర్శి డాక్టర్ వైభవ్ తాండాలే పాల్గొన్నారు. ICBF జనరల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ కన్వీనర్ వర్కీ బోబన్ స్వాగత ప్రసంగం చేశారు. ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావా స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు A.P. మణికంఠన్, ISC అధ్యక్షుడు E.P. అబ్దుల్‌రహిమాన్, ప్రవాసీ భారతి సమ్మాన్ అవార్డు గ్రహీత హసన్ చౌగ్లే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి మెమెంటోలు, సర్టిఫికేట్‌లతో హాజరైన ప్రముఖులను సత్కరించారు. ఐసిబిఎఫ్ కార్యదర్శి టి.కె. ముహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు ముహమ్మద్ కున్హి, కుల్దీప్ కౌర్ బహల్, జరీనా అహద్, సమీర్ అహ్మద్, శంకర్ గౌడ్, కుల్విందర్ సింగ్, అబ్దుల్ రవూఫ్ కొండొట్టి, చైర్మన్ S.A.M బషీర్, సభ్యులు హరీష్ కంజాని, అరుణ్ కుమార్, శశిదర్ హెబ్బాళ్, T. రామసెల్వం, హమీద్ రజా, వర్కీ బోబన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







