కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడం పై రేవంత్ కామెంట్స్
- August 21, 2023
హైదరాబాద్: అధికార పార్టీ బిఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను సోమవారం తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. కాగా రెండు స్థానాల్లో కేసీఆర్ బరిలోకి దిగుతుండడం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ రెండో స్థానాల్లో పోటీ చేస్తున్నాడని రేవంత్ అన్నారు.
ఎన్టీఆర్ తెలంగాణలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓడి పోయాడు. కేసీఆర్ కూడా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని , కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ ఎయిర్ ఫోర్ట్, హైదరాబాద్ డెవలఫ్ మెంట్ జరిగిందని రేవంత్ అన్నారు. కానీ కేసీఆర్ తాను డెవలప్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని , కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ అందజేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరిగిన కేసీఆర్ ని ఓడించాలనే ప్రజలు చూస్తున్నారని , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







