‘గుంటూరు కారం’.! డౌట్లన్నీ పటా పంచల్ చేసిన సూపర్ స్టార్.!
- August 21, 2023
ఈ మధ్య మహేష్ సినిమాల్లో ఏ సినిమాకీ లేనంత రచ్చ జరిగింది రిలీజ్‌కి ముందే ‘గుంటూరు కారం’ సినిమాకి. హీరోయిన్ విషయం దగ్గర్నుంచీ, టెక్నీషియన్స్, షూటింగ్.. ఇలా ఏది తీసుకున్నా ఇష్యూనే అనేలా ఈ సినిమా గురించి చర్చ నడిచింది.
అయితే, ఈ రచ్చకు కిక్కిచ్చేలా సూపర్ స్టార్ మహేష్ బాబు కౌంటర్ ఇచ్చేశాడు. దేబ్బకి దుష్ర్పచారంతో రచ్చ చేసిన సో కాల్డ్ మీడియాలన్నీ కామ్ అయిపోయాయ్ మహేష్ మాటల ధాటికి.
సినిమా అన్నాకా, రకరకాల మార్పులు చేర్పులు జరుగుతాయ్.. అవన్నా సర్వ సాధారణం అని చురకలు అంటిస్తూనే దీంతో పాటూ, వ్యక్తిగతంగా మహేష్ టూర్స్‌పై వస్తున్న అనవసర ప్రచారానికి సైతం చెక్ పెట్టేశాడు మహేష్ బాబు.
విదేశీ టూర్లకు వెళ్లడం, రావడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. అయినా, నేను సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా చెప్పడం వల్లనే కదా.. మీకు ఆ విషయం తెలుస్తుంది. అందులో అంత పెద్ద రాద్ధాంతం చేయడానికి ఏముంది.?
‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తవుతుంది. ఖచ్చితంగా సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది.. అని మహేష్ బాబు గ్యారంటీ ఇచ్చేశారు. అనవసర రాద్ధాంతాలు చేసే మీడియా సంగతెలా వున్నా.. అసలు విషయం (గుంటూరు కారం రిలీజ్) బయటికొచ్చేసరికి మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







