‘ఈగల్’ కోసం విదేశాలకు వెళ్లనున్న మాస్ రాజా.!
- August 21, 2023
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లే.. పూర్తి చేసి వదిలేస్తున్నాడు మాస్ రాజా. అందులో కొన్ని తుస్ అంటున్నాయ్. కొన్ని హిట్ అవుతున్నాయ్.
ఆ సంగతి అటుంచితే, ప్రజెంట్ ఆయన చేతిలో రెండు ప్రాజెక్లులున్నాయ్. రెండూ సైమల్టేనియస్‌గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.
రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రవితేజ అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, ఇంకో సినిమా ‘ఈగల్’ కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం లండన్‌లో షూటింగ్ ప్లాన్ చేశారట. అందుకోసం లండన్‌కి ప్రయాణం కట్టబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ‘ఈగల్’ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమా రిలీజ్‌ని సంక్రాంతికి లాక్ చేసి పెట్టాడు రవితేజ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







