‘ఖుషి’ ప్రీ రిలీజ్ బిజినెస్.! ఓ రేంజ్‌లో.!
- August 21, 2023
‘లైగర్’ దెబ్బకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ మారిపోయింది. సెన్సేషనల్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకున్న రౌడీకి, ‘లైగర్’ భారీ షాకిచ్చిందని చెప్పొచ్చు. కోలుకోలేని దెబ్బ తినేశాడు. దాంతో గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘ఖుషి’ సినిమాతో వస్తున్నాడు.
‘ఖుషి’పై మెల్ల మెల్లగా అంచనాలు క్రియేట్ చేశాడు. ఆ మాటకొస్తే, రౌడీ చేసిందేమీ లేదు. సినిమాలో కంటెంట్ అలాంటిదనుకోవాలేమో. కంటెంట్ గురించి అప్పుడే ఎలా మాట్లాడతాం అంటారా.! అదీ నిజమే.! పోస్టర్లూ, ప్రోమోలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.
పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ప్రీ రిలీజ్‌కే ‘ఖుషి’. ఇక, బిజినెస్ కూడా బాగా జరిగిందంటున్నారు. ‘లైగర్’తో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 52 కోట్లు జరిగిందని అంచనా వేస్తున్నారు. రౌడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిజినెస్ చెప్పుకోదగ్గదే.
మరి, అంచనాలకు తగ్గట్లుగా ‘ఖుషి’ సక్సెస్ అయితే, విజయ్ దేవరకొండ మళ్లీ లైట్ లైట్‌లోకి వస్తాడనడం ఖాయమే సుమీ.! సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







