దుబాయ్ వెళ్లే వారు తీసుకెళ్లకూడని వస్తువుల జాబితా
- August 22, 2023
దుబాయ్: దుబాయ్ వెళ్లే వాళ్ళు మీ లగేజీలో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. తాజాగా దుబాయ్ పోలీసులు దుబాయ్ వచ్చే ప్రయాణికులు తీసుకురాకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఉన్న వస్తువులను పొరపాటున తీసుకెళ్లిన కూడా మీరు ప్రమాదంలో పడతారు. అందుకే దుబాయ్ వెళ్లేవారు ఈ జాబితాను ఒకసారి పరిశీలించడం మంచిది. ఈ మేరకు సోమవారం దుబాయ్ పోలీసులు ట్విటర్ వేదికగా ఒక అడ్వైజరీ నోట్‌ను విడుదల చేశారు. అందులో.. "సురక్షితమైన ప్రయాణాల కోసం నిషేధిత వస్తువులను తీసుకెళ్లకుండా ఉండండి. ఎందుకంటే అవి మీ భద్రతకు మరియు మీ చుట్టూ ఉన్నవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయి" అని పేర్కొన్నారు.
దుబాయ్ పోలీసుల నిషేధిత జాబితాలోని వస్తువుల వివరాలు..
- ఆయుధాలు, పదునైన సాధనాలు
- 100ML కంటే ఎక్కువ ద్రవాలు
- లైటర్లు
- లిథియం బ్యాటరీలు
- ఆల్కహాల్ పదార్థాలు
- మండే స్వభావం కలిగిన పదార్థాలు
- సంపీడన వాయువులు
For safer travels, avoid carrying prohibited items, as they pose risks to your safety and those around you. #SmartSecureTogether pic.twitter.com/g8ZqOeUb0m
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) August 21, 2023
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









