దుబాయ్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ...
- August 22, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20వ తేదీన FOI గ్రూప్ నిర్వహించిన మెగా రక్తదానం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 228 మంది ప్రవాసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చింది. వైస్ కాన్సుల్ మనీందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FOI ఈవెంట్స్ ను నిర్వహించిన వాలంటీర్ వెంకటేష్, FOI బృందాన్ని అభినందించారు. అనంతరం రక్తదానం చేశారు. తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా దుబాయ్ కమ్యూనిటీకి సేవలందించినందుకు గత సంవత్సరం దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారులు FOIని సత్కరించారు. 2006 నుండి FOI గ్రూప్ ‘బీ ఏ డోనర్ బీ ఏ హీరో’ అనే థీమ్ తో దుబాయ్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. దుబాయ్‌లోని లతీఫా హాస్పిటల్‌లో సంవత్సరంలో సుమారు 8 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది.




తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







