అబ్షెర్‌లో 2.6 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు నమోదు
- August 23, 2023
రియాద్: పౌరులు, నివాసితులు మరియు మంత్రిత్వ శాఖలోని వివిధ రంగాల నుండి ఇ-సేవలను పొందాలనుకునే సందర్శకుల కోసం 2.6 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలను సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ అబ్షర్ నిర్వహించింది. పౌర హోదా కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేవల ద్వారా కుటుంబ రిజిస్ట్రీని జారీ చేయడానికి 11,057 ఇ-లావాదేవీలు, జాతీయ IDని పునరుద్ధరించడానికి 27,505 ఇ-లావాదేవీలు, ID యొక్క చెల్లుబాటును ధృవీకరించడానికి 128,255 ఇ-లావాదేవీలు జరిగాయి. దాదాపు 37,185 మంది బయానాటీ సేవ నుండి ప్రయోజనం పొందారు. అయితే 9,209 ఇ-లావాదేవీలు దెబ్బతిన్న జాతీయ IDల పునరుద్ధరణకు, 28,517 ఇ-లావాదేవీలు కోల్పోయిన జాతీయ IDల కోసం నమోదయ్యాయి.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) సేవల విషయానికొస్తే.. 393,986 ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు, 640,588 రెసిడెన్సీ పర్మిట్‌లు (ఇఖామాలు) జారీ చేయబడ్డాయి. 58,270 లావాదేవీలు ఎగ్జిట్ మరియు రీఎంట్రీ వీసాను పొడిగించడం కోసం నమోదు అయ్యాయి. అదే సమయంలో 389 ఎక్స్‌ఇట్ లావాదేవీలు, రీఎంట్రీ వీసా జారీ చేసారు. సేవలను బదిలీ చేయడానికి 6,642 లావాదేవీలు, ముఖీమ్ ప్రింట్ అభ్యర్థన కోసం 32,246, ఫైనల్ ఎగ్జిట్ వీసా రద్దు కోసం 15,047 లావాదేవీలు, పని కోసం వచ్చిన మహిళా కార్మికులను స్వీకరించడానికి 2,029 లావాదేవీలు, పాస్‌పోర్ట్ జారీ, రెన్యువల్ చేసే సేవ కోసం 109,736 లావాదేవీలు జరిగాయి.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) సేవల విషయానికొస్తే.. ప్లాట్‌ఫారమ్ వాహన లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి 108,469 లావాదేవీలు, వాహన మరమ్మతు అనుమతి కోసం 86,717 అభ్యర్థనలు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి 66,096 లావాదేవీలు, డ్రైవింగ్ ఆథరైజేషన్ కోసం 84,347 అభ్యర్థనలు వచ్చాయి. జూలైలో సౌదీ పోస్ట్ లాజిస్టిక్స్ (SPL) ద్వారా పత్రాలను అందించడానికి అబ్షెర్ 172,281 అభ్యర్థనలను నిర్వహించింది. వేలిముద్రల గురించి 5,012 సాధారణ విచారణలు, 9,719 నివేదికలు అబ్షర్ నివేదిక సేవ ద్వారా జారీ చేయబడ్డాయి. అబ్షెర్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ రాక్ కటింగ్ కోసం 109 పర్మిట్‌లను, వాహన మరమ్మతు సౌకర్యాల కోసం 99,734 పర్మిట్‌లను, 56 డిజిటల్ గుర్తింపు ధ్రువీకరణలను, 2,641 ఎయిర్ రైఫిల్ క్లియరెన్స్ కోసం లావాదేవీలను, సందర్శకులకు డ్రైవింగ్ అధికారాలకు సంబంధించిన 5,616 లావాదేవీలను జారీ చేసింది.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







