మీర్‌పేట అత్యాచార ఘటన..నిందితులందరూ అరెస్ట్
- August 23, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మీర్‌పేట బాలిక సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు ఏడుగురినీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన బాలిక తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి నగరానికి వచ్చి లాలాపేటలోని శాంతినగర్‌లో ఉంటోంది. వారం రోజుల క్రితం మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో ఉంటున్న వరుసకు సోదరి అయిన మహిళ వద్దకు వచ్చింది. మంగళహాట్ సీతారాంపేటకు చెందిన రౌడీషీటర్ అబేద్ బిన్ ఖలేద్ నందనవనంలో ఉంటున్న తన స్నేహితులు తహసీన్, మాంకాల మహేశ్, ఎం.నర్సింగ్, అష్రఫ్ వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 19న నందనవనం వచ్చిన అబేద్ బాలికను చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఈ నెల 21న ఉదయం 11 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బాలిక ఇంట్లోకి వెళ్లాడు.
ఆ సమయంలో బాలికతోపాటు ఆమె ఇద్దరు తమ్ముళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి వచ్చీ రావడమే బాలికను బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి కత్తితో బెదిరించి అబెద్ బిన్, తహసీన్, మహేశ్ లైంగికదాడికి పాల్పడ్డారు. మిగతావారు ఆమె తమ్ముళ్లను బెదిరించి దూరంగా పంపించేశారు. విషయాన్ని బాలిక తన సోదరికి చెప్పింది. అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.
తాజా వార్తలు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







