మూడు గంటల వ్యవధిలో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ అరెస్ట్
- August 23, 2023
దుబాయ్: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన 24 ఏళ్ల ఆసియా డ్రైవర్‌ను దుబాయ్ పోలీసులు మూడు గంటలలోపు పట్టుకున్నారు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 27 ఏళ్ల ఆసియా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని తక్షణ వైద్యం కోసం రషీద్ ఆసుపత్రికి తరలించారు.
బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అబ్దెల్ మోనీమ్ అబ్దెల్ రహ్మాన్ ముహమ్మద్ మాట్లాడుతూ.. అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగినట్లు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు గత ఆదివారం రాత్రి 10 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, వాహనదారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టారు. "విచారణలో, ఆసియన్ యువకుడు రోడ్డును దాటుతున్నప్పుడు వాహనం ఢీకొట్టింది. డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడు" అని కల్నల్ మోనీమ్ చెప్పారు. ప్రత్యేక బృందాలు గంటలో ఢీకొట్టిన వాహనాన్ని విజయవంతంగా గుర్తించారని, అనంతరం దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో 3 గంటలలోపు పట్టుకున్నారని కల్నల్ మోనీమ్ చెప్పారు. రోడ్లు దాటే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కల్నల్ కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







