భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి: సిఎం జగన్
- August 23, 2023
అమరావతి: ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ప్రాజెక్టులకు శంకుస్థాసన చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్రాజెక్టులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు 2,300 మెగావాట్ల సౌర విద్యుత్ కు సంబంధించి రూ.10,300 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లుగా పేర్కొన్నారు. 10,300 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా 2,300 మందికి ఉద్యగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







