దుబాయ్ వాటర్ అథారిటీలో వర్చువల్ ఉద్యోగి ప్రయోగం సక్సెస్
- August 23, 2023
యూఏఈ: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) తన వర్చువల్ ఉద్యోగి రామ్మాస్ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతుందని ప్రకటించింది. అథారిటీ సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ టేయర్ మాట్లాడుతూ.. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రయోగం దోహదపడిందని పేర్కొన్నారు. వినియోగదారుల విచారణలను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో వర్చువల్ ఎంప్లాయ్ కు ChatGPT ఉపయోగపడిందని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి వర్చువల్ ఉద్యోగి రామ్మాస్ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా మరియు సమాచారం ఆధారంగా కస్టమర్ విచారణలను నేర్చుకునేందుకు, అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి రామ్మాస్ సామర్థ్యాన్ని చాట్‌జిపిటి మెరుగుపరుస్తుందని, దీంతో తక్షణమే మరియు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుందని వివరించారు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో DEWA వెబ్సైట్ మరియు స్మార్ట్ యాప్ ద్వారా 32,084 ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు తెలిపారు. చాట్‌జిపిటిని పైలట్ వినియోగిస్తున్న సమయంలో రామ్మాస్ సేవల పట్ల కస్టమర్ సంతోషం 90 శాతానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







