స్పైస్‌జెట్ జాబితాలో ఇండిగో ...
- May 18, 2016
విమాన యాన సంస్థలు ఆఫర్లను ప్రకటించి ప్రయాణికుల్ని ఆకర్షించడంలో పోటీ పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఎయిర్‌ఏషియా, స్పైస్‌జెట్‌లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తే... ఇప్పుడు ఆ జాబితాలో ఇండిగో కూడా చేరింది. నిర్దేశించిన రూట్లలో టిక్కెట్లను డిస్కౌంట్ ఆఫర్లపై అందిస్తున్నట్లు చెప్పింది. దేశీయ రూట్లలో టిక్కెట్ ప్రారంభ ధర రూ.806గా నిర్ణయించినట్లు తెలిపింది. గురువారంలోపు ఈ తగ్గింపు ఆఫర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. జులై4 నుంచి సెప్టెంబరు 30లోపు ప్రయాణించాలనుకున్న వారు ఈ ఆఫర్లో టిక్కెట్ బుక్ చేసుకోవాలని సూచించింది.
* శ్రీనగర్-చండీగఢ్, శ్రీనగర్-జమ్ము రూట్లలో ప్రయాణించాలనుకున్న వారు ఈ ఆఫర్ ద్వారా రూ.806కే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
* దిల్లీ-ముంబయి, దిల్లీ-కోల్‌కతా రూట్లలో రూ.2,668 నుంచి, దిల్లీ-బెంగళూరు రూట్లో రూ.3,408 నుంచి టిక్కెట్ ప్రారంభ ధర ఉంటుందని తెలిపింది.
మంగళవారం స్పైస్ జెట్.. దేశీయ రూట్లలో విమాన టిక్కెట్ ప్రారంభధర రూ.511 అని ప్రకటించగా, సోమవారం ఎయిర్ ఏషియా సైతం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







