భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు..
- May 18, 2016
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 35 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 150 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కెగల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 66 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 22 జిల్లాల్లో 20సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. దీంతో 300మంది సైనిక సిబ్బందితో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అరనాయకీ గ్రామంలో చిక్కుకున్న 150మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







