టిల్లుగాని గాళ్ ఫ్రెండ్‌కి గెస్ట్ రోల్.?
- August 24, 2023
‘డీజె టిల్లు’ సినిమాతో ముద్దుగుమ్మ నేహా శెట్టికి మంచి పేరొచ్చింది. ఈ అమ్మడు ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్సకులకు పరిచయమైంది. తొలి సినిమా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ, మలి సినిమా ‘డీజె టిల్లు’తో తెగ పాపులర్ అయిపోయింది నేహా శెట్టి.
ముఖ్యంగా ఆమె పాత్ర పేరు యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ‘రాధిక’ అనే పేరుతో హీరో సిద్దు జొన్నల గడ్డ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. తెగ వైరల్ అయ్యింది దాంతో, ఈ క్యారెక్టర్ పోషించిన నేహా శెట్టి.
ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు దక్కకపోయినా, సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది. తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాలో నటిస్తోంది. కార్తికేయ హీరో. ఈ శుక్రవారం ‘బెదురులంక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేహాశెట్టికి మరో ఆఫర్ దక్కింది.
డీజె టిల్లుకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నేహా శెట్టి గెస్ట్ రోల్‌లో స్టన్నింగ్ పాత్రలో కనిపించబోతోందట. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







