షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినకూడదా.?
- August 24, 2023
సీజనల్‌గా వచ్చే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలం మొదలవుతుండగా వచ్చే సీతా ఫలం తినడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని డైటీషియన్లు చెబుతున్నారు.
సీతాఫలం తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్.
ఉదయం పూట ఈ పండు తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల వాతాల వంటి సమస్యలు తొలిగిపోతాయ్. అలాగే, శీతాకాలంలో ఈ పండు లభించడం వల్ల ఈ పండు తినేవారిలో చెడు కొలెస్ర్టాల్ తొలిగిపోతుంది. అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కణాలు కరిగిపోతాయి.
గర్భిణి స్తీలు ఈ పండు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మెదడు చురుగ్గా పని చేస్తుంది. అల్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులు తొలిగిపోతాయ్.
అలాగే క్యాన్సర్‌ని దూరం చేసే శక్తి ఈ పండుకు వుంది. సీతా ఫలం.. పండు మాత్రమే కాదు, ఈ చెట్టు ఆకులూ, బెరడు కూడా ఔషధమే. పలు రకాల మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
అయితే, షుగర్ వ్యాధి గ్రస్థులు ఈ పండును ఎక్కువగా తీసుకోరాదని చెబుతుంటారు. అయితే అది నిజమే అని కొన్ని సర్వేల్లో తేలింది. వైద్యుని సలహాతో పరిమితంగా మాత్రమే ఈ పండు తీసుకోవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి