వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్న రేవంత్ రెడ్డి
- August 24, 2023
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో క్లారిటీ వచ్చింది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ నుంచే పోటీ చేయబోతున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి పోటీ చేయడానికి ఈరోజు ఆయన పార్టీకి దరఖాస్తు చేయనున్నారు. తన తరపున కొడంగల్ లోని స్థానిక నేతలు దరఖాస్తు చేస్తారని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొడంగల్ కార్యకర్తల ద్వారా దరఖాస్తు ఇవ్వబోతున్నామని తెలిపారు. సోనియా ఆదేశాల మేరకు ఇది జరుగుతోందని చెప్పారు. కొడంగల్ అభివృద్ధే లక్ష్యంగా అక్కడి నుంచి పోటీ చేయాలని సోనియా చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీపీసీసీ చీఫ్ అయినా, సామాన్య కార్యకర్త అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను ఈరోజు దరఖాస్తు చేయబోతున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







