పెళ్ళైన కొద్దిసేపటికే విడాకులు ఇచ్చిన భర్త
- May 18, 2016
తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్‌లో స్నేహితులతో చాటింగ్ చేస్తోందని ఓ వ్యక్తి పెళ్లైన వెంటనే భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పెళ్లి తంతు ముగియగానే నూతన వధూవరులు హోటల్‌కు వెళ్లారు. హోటల్ గదిలోకి వెళ్లగానే వధువు చాలా బిజీగా చాట్ చేయడం ప్రారంభించింది. పెళ్లికొడుకును అస్సలు పట్టించుకోలేదు.
నీతో మాట్లాడాలనుకుంటున్నానని పెళ్లి కొడుకు నోరు తెరిచి అడిగినా వినిపించుకోకుండా ఆమె చాటింగ్ చేస్తూనే ఉండడంతో అతడు కంగుతిన్నాడు. వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలిస్తున్న తన స్నేహితులతో చాటింగ్ చేస్తూ బిజీగా ఉన్నానని ఆమె చెప్పడంతో అతడికి మరింత కోపం వచ్చింది.
వారితో తర్వాత చాట్ చేయొచ్చు కదా అని భర్త అంటే.. లేదు ఇప్పుడే మాట్లాడుతానని ఆమె సమాధానం ఇచ్చింది. అతడు కూడా కోపంతో 'నేను ముఖ్యమా.. స్నేహితులు ముఖ్యమా' అని ప్రశ్నించాడు. తనకు స్నేహితులే ముఖ్యమని ఆమె సమాధానమిచ్చింది. దీంతో అతడు కోపంతో వధువుకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడు. వెంటనే విడాకులకు పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అయితే కోర్టు వీరి కేసును రాజీ కుదిర్చే కమిటీకి సిఫార్సు చేసింది. కానీ వరుడు పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదని.. కచ్చితంగా విడాకులు కావాలని కోరినట్లు సమాచారం. సౌదీలో జరిగిన ఈ ఘటన గురించి గల్ఫ్‌న్యూస్ మంగళవారం ప్రచురించింది.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







