భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడని ఇల్లు కాల్చిన భార్య
- May 18, 2016
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడన్న కోపంతో భార్య ఇల్లు తగులబెట్టిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి భర్త విదేశాలకు రెండో హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగుల బెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.10 ఏళ్ల క్రితం పెళ్లెన ఆమెకు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ తింది. రెండో భార్యతో కలిసి అతడు విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి జాజన్ పోర్ట్ సిటీలోని తన ఇంటికి నిప్పు పెట్టింది. అయితే తగలబడి పోతున్న ఇంటిని చూసి మంటలు ఆర్పేందుకు సహాయం చేయాలని పొరుగింటి వారిని కోరడం గమనార్హం.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







