చెస్ ప్రపంచ కప్‌ సిల్వర్ పతక విజేత ప్రజ్ఞానంద

- August 25, 2023 , by Maagulf
చెస్ ప్రపంచ కప్‌ సిల్వర్ పతక విజేత ప్రజ్ఞానంద

అజర్‌బైజాన్‌: ఫైడ్ ప్రపంచ కప్‌ ఫైనల్ వరకు వెళ్లడం, తాను చెస్‌లో రాణించడం వెనుక తన తల్లి నాగలక్ష్మి  తన కోసం చేసిన త్యాగం ఉందని ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద (18) అన్నాడు.

అజర్‌బైజాన్‌ లోని బాకులో జరిగిన ఫైడ్ ప్రపంచ కప్‌ ఫైనల్ వరకు వెళ్లి ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. దీంతో అతడికి సిల్వర్ పతకం దక్కింది. ప్రజ్ఞానందపై నార్వేకు చెందిన 32 ఏళ్ల మాగ్నస్‌ కార్ల్‌సన్ గెలిచాడు.

అజర్‌బైజాన్‌లో ప్రజ్ఞానంద వెంటే తల్లి నాగలక్ష్మి ఉంటూ కుమారుడి బాగోగులు చూసుకుంటున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా, ప్రజ్ఞానంద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపాడు. ఫైడ్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఆ దేశంలో తన తల్లి తన కోసం చేసి పెట్టిన ఇంటి వంట బాగా ఉపయోగపడిందని చెప్పాడు. తన తల్లి మద్దతు వల్లే సిల్వర్ పతకం సాధించానని తెలిపాడు. బాకులో తన తల్లి వండిన రసం, అన్నాన్నే ప్రజ్ఞానంద తిన్నాడు. కాగా,

ఫైనల్లో తాను మరింత బాగా ఆడితే బాగుండేందని చెప్పాడు. తొలి రౌండ్ గేమ్‌లో క్లార్‌స‌న్‌ను ఎదుర్కొంటున్న సమయంలోనే సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయానని అన్నాడు. తొలి రౌండ్ గేమ్ చాలా ముఖ్యమైందని, మంచి స్థానంలోనే ఉన్నప్పటికీ ఆ కీలక సమయంలోనే విఫలమయ్యానని చెప్పాడు.

తప్పకుండా గెలవాల్సిన గేమ్‌ తనకు ఎదురైందని, అది అంత సులువేం కాదని అన్నాడు. ఫైనల్లో తొలి రెండు గేమ్‌లూ డ్రా అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన ట్రై బ్రేక్‌లో రమేశ్ బాబు ప్రజ్ఞానంద ఓడిపోయాడు. ఇటువంటి గేమ్ ను ఎదుర్కోవడంలో మాగ్నస్‌ కార్ల్‌సన్ కు అపార అనుభవం ఉందని చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com