టీటీడీ పాలకమండలి ప్రకటనపై అచ్చెన్నాయుడు విమర్శలు
- August 27, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని ప్రకటించగా, అందులో కొందరు వ్యక్తుల నియామకంపై విపక్షాలు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. వైఎస్ఆర్సిపి పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడ్ని టీటీడీ చైర్మన్ చేశారని, శరత్ చంద్రారెడ్డి వంటి వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా చేశారని విమర్శించారు.
ఇక, ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి నెలన్నర పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యాచరణ ఉంటుందని వివరించారు. కోటి ఇళ్లకు వెళ్లేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని టిడిపి శ్రేణులకు అచ్చెన్న పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







